No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్మాధవ సేవే కాదు.. మానవ సేవ కూడా చేద్దాం..

మాధవ సేవే కాదు.. మానవ సేవ కూడా చేద్దాం..

- Advertisement -
  • – యువసేన యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం… 
  • నవతెలంగాణ – డిచ్ పల్లి
  • డిచ్ పల్లి మండలం లోని ఘనపూర్ గ్రామం లో యువసేన యూత్ ఆధ్వర్యం లో  ఏర్పాటు చేసుకున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఆదివారం ఏర్పాటు చేశారు. 
  • గతేడాది రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు విజ్ఞప్తి మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లే  ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం లో నిర్వహించినట్లు వారు వివరించారు.ఈ శిబిరం లో యువకులు అత్యంత ఉత్సాహం తో రక్తదానం చేశారు .ఈ సందర్బంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో గణేష్ మంటపాల వద్ద యువకులు అన్నదానం తో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి రక్తదానం చేస్తే జిల్లాలో రక్త కొరత ఉండదని ,తలసేమియా బాధితులకు ,శస్త్రచికిత్సలు ,ప్రమాదాల సమయం లో ఈ రక్తం ఉపయోగపడుతుందని తెలిపారు . రక్తదానం చేసినవారు ప్రాణదాతలుగా మిగిలిపోతారని అయన అన్నారు .ఈ కార్యక్రమం లో యువసేన యువకులు ,మండల్ రెడ్ క్రాస్ చైర్మన్ వర్మ ,రెడ్ క్రోస్ డాక్టర్ రాజేష్ ,రెడ్ క్రాస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad