- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ బి ఎస్ కే( రాష్ట్రీయ బాల స్వస్థత,) వారు సోమవారం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎనీమియా ముక్తా భారత్ లో భాగంగా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్, ఫార్మసిస్టు రజని ,ఏఎన్ఎం పి జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -