ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంపీపీ

నవతెలంగాణ-పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కాన్వాయిగూడెం ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ, గ్రామ సర్పంచ్ మద్దెల కరుణ ఆంజనేయులుతో కలిసి తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేసిందన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. పాఠశాలలో 13 లక్షలతో నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణ పనులను ఆమె పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసాని కుమార్, గ్రామ యూత్ అధ్యక్షుడు బొమ్మెర హరీష్, వార్డు సభ్యులు ఏడెల్లి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love