ఎండుతున్న వారి పైరులు

– సాగర్ ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకమే
– వర్షాలు పడటం లేదు, సాగునీరు వచ్చే అవకాశం లేదు
– సంకట స్థితిలో వరి సాగు చేసిన రైతన్నలు
– ఎన్నికలవేళ సాగునీరు సరఫరా చేస్తారని ఆశ
నవతెలంగాణ -కల్లూరు
సాగర్ అయి కట్టు కింద ఈ ఖరీప్ లో వరి సాగు చేసిన రైతులు పరిస్థితి సంకట స్థితిలో పడి పెట్టుబడులు నష్టపోతామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోతాయా సాగర్ జలాలు రాకపోతాయా అని వర్షాలు పడుతుంటే రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశారు. కానీ రైతుల ఆశించిన రీతిలో వర్షాలు పడకపోవడంతో పాటు వరి పైరు కూడా ఆశాజనకంగా లేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక ఎకరానికి 15 నుండి 20 వేల వరకు ఇప్పటికే పెట్టుబడులు పెట్టి ఉన్నారు. నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణం శాఖ ప్రకటించడంతో పంటల ను మరో నెల రోజులు పాటు బతికించుకోవచ్చునని రైతులు ఆశపడ్డారు, కానీ ప్రకృతి అనుకూలించకపోవడం భారీ వర్షాలు సైతం జల్లులకే పరిమితం కావడంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కర్రీ వేద పద్ధతిలో వరి సాగు చేయటం వల్ల కలుపు నివారణ కోసం అని కలుపు మందు పిచికారి చేయటంతో ఫైర్ కు సరిపడ నీరు తేమ లేకపోవడం వల్ల కలుపు మందు ప్రభావంతో ఫైర్ పచ్చద పచ్చదనానికి రాకపోగా పసుపు రంగులోకి మారింది తో రైతుల బాద మరింత ఎక్కువైంది. ఈ నాలుగు రోజులు పాటు మండలంలో ఆగస్టు నెలలో 5 వ తేదీన 5.4, మిల్లీమీటర్లు వర్షం పడింది,11వ తేదీన 2.4, మిల్లీమీటర్లు వర్షం పడింది, 15న 4.4, మిల్లీమీటర్లు వర్షం పడింది,18 న తేదీన 3.4, మిల్లీమీటర్లు వర్షం పడింది,19 వ తేదీన 3.4, మిల్లీమీటర్లు వర్షం పడింది 20 వ తేదీన 1.2 మిల్లీమీటర్లు వర్షం పడ్డది . ఆగస్టు నెల లో సాధారణ వర్షపాతం మొత్తం 273 మిల్లీమీటర్ల పడాల్సి ఉండగా 20వ తేదీ నాటికి పడ్డ వర్షం 20.2 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదయింది ఆగస్టు నెల పూర్తిగా వస్తుంతున్నా కనీసం సగం కూడా వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటలపై రైతులకు అప్పనమ్మకం ఏర్పడి మరింత ఆందోళన గురవుతున్నారు. కల్లూరు మండలంలో ప్రతి ఏటా ఖరీఫ్లో 33 వేల 7 40 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 31,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. మండలంలో 17 మేజర్ చెరువులు 80 కుంటలు సాగర్ జలాలతో వరి పండిస్తున్నారు. ప్రతి 2300 ఎకరాలు, మిర్చి 2700 ఎకరాలు లో సాగు చేస్తున్నారు. కేవలం సాగర్ జలాలపై ఆధారపడి మండలంలో 19 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 19 ఎకరాల్లో వరి పైరు ప్రశ్నార్థకంగా మారింది. మేజర్ ఇరిగేషన్, కుంటల్లో కూడా సాగర్ జలాలు వస్తేనే పంట చేతికి వస్తుంది. ప్రస్తుతం చెరువులో ఉన్న నీరు చెరువు అయ్యకట్టు ను కాపాడుతుంది. సాగర్ ఆయకట్లో సాగు చేసిన వరిపై రుకు సరిపడా తేమ లేక వర్షాలు పడక పంట ఎదుగుదల లేక అప్పులు చేసి సాగు చేసి రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాం లో ప్రస్తుతం 519.7 నీటి నిల్వ ఉన్నది. సాగర్ జలాలు పంటలకు కు విడుదల చేయాలంటే కనీసం 540,550, అడుగుల నీటిమట్టం ఉంటేనే సరఫరా చేయటానికి వీలవుతుందని అధికారులు అంటున్నారు. మొత్తం డ్యామ్ సామర్థ్యం 590 అడుగులు కాగా కేవలం 519.7 నీటి నిలువ మాత్రం ఉండటం వల్ల సాగునీరు సరఫరా చేసా అవకాశాలు లేవని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తుంతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పరిస్థితి ఏమిటి అంటూ ఎటూ తేల్చుకోలేక సాగు చేసిన పేర్లు కాపాడుకోలేక రైతులు మనోవేదన గురవుతున్నారు. ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కనీసం రెండు మూడు తండ్లకైనా సాగునీరు సరఫరా చేయకపోతారా అని రైతులు ఆశపడుతున్నారు. అప్పటివరకు కూడా అడపాదప గట్టి వర్షాలు పడితే పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుందని ఆశతో ఆకాశం వైపు ఎదురుచూస్తూ ఎ పూట కాపూట మేఘాలు కమ్ముకుంటున్నాయి చినుకులు మాత్రమే రాలుతున్నాయి దీంతో రైతన్నకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి.
సాగర్ జలాలు విడుదల చేసి పంటలను కాపాడాలి
రైతు సంఘం ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వరరావు చెన్నూరు.
ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని నెల రోజులు ముందుకు తీసుకురావాలని రైతులను ప్రోత్సహించడంతో అ డప దడపపడ్డ వర్షాలకి సాగర్ నాయకట్లో కూడా పంటలు సాగు చేయడం జరిగిందని అన్నారు. వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతులు ఎకరానికి 20 వేల వరకు పెట్టుబడి పెట్టారని ఇప్పుడు పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం ఉన్న సాగునీరుని విడుదల చేసి పంటలు కాపాడాలని కోరారు. సాగునీరు విడుదల చేయకపోతే పంటలు ఎండిపోక పోవడం ఖాయం అని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వం గుర్తించి రైతులు బాధను అర్థం చేసుకొని సాగునీటి విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.

Spread the love