- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. డాక్టర్ నవీన్ నూకల కంటి వైద్య నిపుణులు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు పరీక్షలు స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ నూకల మాట్లాడుతూ.. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 100 మంది వరకు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సతీష్, ప్రాక్టీస్నర్ జిన్నా సాగర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -