- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన జాగీర్ సింగ్ గోడకూలి మృతి చెందగా బాధిత కుటుంబానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, నాయకులు లింబాద్రి, సాజిద్, తదితరులు ఉన్నారు.
- Advertisement -