- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న వివేకానంద పాఠశాల ఆధ్వర్యంలో రూపొందించిన బంగారు బతుకమ్మ పాట సిడిని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేతుల మీదుగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విడుదల చేయడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ అమరగొండ సతీష్ గౌడ్ తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపడుచుల బతుకమ్మ పండుగను కళ్లకు కట్టినట్టుగా చూపెట్టడానికి పాటను వివేకానంద పాఠశాల యాజమాన్యం రూపొందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఏం సి చైర్మన్ దుర్గం లక్ష్మి నారాయణ, పాఠశాల, ఇంచార్జీ తిరుపతి, ట్రస్మ రాష్ట్ర నాయకులు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -