- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
గర్భిణీలు వైద్యుల, ఆరోగ్య సిబ్బంది సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలోని సుఖ ప్రసవం అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకొవాలని మెడికల్ అధికారి యేమీమా తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకొవాలన్నారు. గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గర్భిణీలు ఉన్నారు.
- Advertisement -