ముగ్గురు బాలికలపై ముగ్గురు యువకుల లైంగికదాడి
నిందితులతోపాటు లాడ్జి యజమాని అరెస్ట్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
నవతెలంగాణ – జవహర్‌నగర్
యాదగిరిగుట్టలో అమానుష ఘటన జరిగింది. పాఠశాలకు వెళ్లకుండా దైవదర్శనానికి బయలు దేరిన బాలికలను బస్టాండ్‌లో పరిచయమైన యువకులు మాయ మాటలతో నమ్మించి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన ముగ్గురు బాలికలను ముగ్గురు యువకులు యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అక్కడ ఓ లాడ్జిలో లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులతో పాటు లాడ్జి యజమానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఈ నెల 20న స్కూల్‌లో బతుకమ్మ ఉత్సవాలు ఉన్నాయని ఇండ్ల నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే, బాలికలు పాఠశాలకు రాకపోవడంతో ఓ టీచర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఆందోళనకు గురైన వారు బాలికల స్నేహితుల ఇండ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, స్కూల్‌కని బయల్దేరిన ముగ్గురు బాలికలు యాదగిరిగుట్ట వెళ్లాలని తార్నాకకు చేరుకున్నారు. అక్కడ మాణికేశ్వరి నగర్‌కు చెందిన మధు, వారాసిగూడకు చెందిన నీరజ్, మల్లీశ్వరినగర్‌కు చెందిన అరవింద్ బాలికలను పరిచయం చేసుకున్నారు. వారు యాదగిరిగుట్టకు వెళ్తున్నట్టు తెలుసుకుని.. తామూ అక్కడికే వెళ్తున్నామని మాయమాటలు చెప్పి బాలికలను నమ్మించారు. అనంతరం ఆరుగురు కలిసి బస్సులో యాదగిరిగుట్టకు వెళ్లారు. గుట్టపై దర్శనం అనంతరం లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. రాత్రంతా ఆ గదిలోనే ముగ్గురు బాలికలపై ఆ ముగ్గురు దుండగులు లైంగికదాడి చేశారు. మరునాడు ఉదయం బాలికలను తార్నాకలో వదిలేసి వెళ్లారు. ఇండ్లకు చేరుకున్న బాలికలను వారి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారని నిలదీసేసరికి.. జరిగిన విషయమంతా చెప్పారు. పోలీసులు ముగ్గురు యవకులను అరెస్టు చేసి వారిపైన పోక్సో కేసు నమోదు చేశారు. యువకుల వెంట బాలికలు ఉన్నారని తెలిసి కూడా లాడ్జిలో గదిని అద్దెకు ఇచ్చిన యజమాని సోమేశ్‌ను కూడా అరెస్టు చేసి అందరినీ రిమాండ్‌కు తరలించారు.
యాదగిరిగుట్టలో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES