- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వారి జెట్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డ్స్ కి దుబ్బాక మండల పరిధిలోని ధర్మాజీపేట జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు డాక్టర్ ఎండీ. సాదత్ అలీ, లచ్చపేట వార్డులోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు మెరుగు నరేష్ లు హైదరాబాద్ లోని హరిహర కళా భవన్ లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డులను అందుకున్నారు. విద్యార్థులకు సైన్స్, తెలుగు భాష పట్ల అభిరుచిని పెంపొందించడం, ప్రయోగాత్మక బోధనను అందిస్తున్నందుకు గాను టీచర్లు సాదత్ అలీ నరేష్ లకు ఈ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా వింగ్ కమాండర్ అంటోనీ చేతుల మీదుగా రూ. 5000 నగదు పురస్కారం అందుకున్నారు.
- Advertisement -