నవతెలంగాణ పెద్దవంగర: సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సీఆర్పీలు సంతోష్, నిరంజన్, రంగన్న, రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని, అరటి పండ్లు, కూరగాయలు విక్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, తాము ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. రెగ్యులరేషన్ చేసేవరకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య భీమా కల్పించాలన్నారు. విద్యాశాఖ చేపట్టబోయే నియామకాల్లో మొదటి వెయిటేజీ కల్పించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.