- Advertisement -
నవతెలంగాణ – కంటేశ్వర్
మానవ హక్కుల నేర నిరోధక సంఘం సభ్యులుగా గత కొన్ని సంవత్సరాలుగా మానవహక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సేవలను గుర్తించి నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా పుల్గం మహేష్ కుమార్ కు పదోన్నతి కల్పిస్తూ సంఘం జాతీయ చైర్మన్ బొడా రాకేష్ నాయక్ (ఐ గో టు న్యాయవాది) ఆదేశాలు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నమెంట్ కు సంబంధించిన ఈ కార్యాలయంలో నైనా సరే మానవ హక్కులను ఉల్లంఘన జరిగినట్లయితే సదరు బాధితులు మానవ హక్కుల సంస్థని ఆశ్రయిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. చట్టపరంగా పోరాటాలకు సిద్ధమవుతామని మహేష్ కుమార్ ప్రకటనలు ప్రజలకు తెలిపారు.
- Advertisement -