- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్ : మండలంలోని అమ్రాద్ గ్రామ శివారులో అర్ అండ్ బి రోడ్డు ప్రక్కన గుర్తు తెలియని మహిళ శవం శనివారం లభ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు ప్రక్కన మహిళా శవం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. మృతురాలు సుమారు (60) ఉంటుందనీ, ఈ మహిళా గురించి ఏదైనా సమాచారం ఉన్నచో మాక్లూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగలరని ఎస్సై తెలిపారు. ఎస్సై నెం. 8712659846
- Advertisement -