
బాల్య దశలోనే తండ్రి,మూడు సంవత్సరాల క్రితం తల్లీ ఇద్దరిని కోల్పోయి అనాధగా మారిన యువతి వివాహానికి పుస్తె మెట్టెలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. గురువారం దౌల్తాబాద్ మండలం దీపాయం పల్లి గ్రామంలో నిరుపేద వధువు గొల్ల సమీరా వివాహానికి పుస్తే మెట్టెలు, పెళ్లి చీర అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామానికి చెందిన గొల్ల అనసూయ-మల్లేశం దంపతులు ఇద్దరు మృతి చెందారు. వీరి కూతురు గొల్ల సమీరా, కుమారుడు సందీప్ తల్లిదండ్రులను కోల్పోవడంతో పెంచిపోషించేవారు లేకపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారినారు. హాస్టల్ లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించారు. సమీరా విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడంతో బంధువుల సహకారం వివాహం నిశ్చయించారు. వీరి కుటుంబం పెద్ద దిక్కులేని నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహకారంతో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు.అసలే నిరుపేద కుటుంబం తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోవడం చాలా బాధాకరం. సమీరా దీనగాథను వింటుంటే ఎంతో విషాదకరమన్నారు. సమీరా వివాహానికి సహకారం అందించాలని పుస్తె మెట్టెలు, చీర అందజేయడం జరిగిందన్నారు. నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, సీనియర్ జర్నలిస్టులు శంభు లింగం, మహేష్, యాదగిరి, గ్రామస్తులు కుమార్,సందీప్,సురేష్,యాదగిరి, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.