విజ్ఞానం అందించడంలో గురువులదే ప్రధాన భూమిక 

– ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు హిమభిందు

– మండలంలో ఘనంగా గురుపూజోత్సవం 
నవతెలంగాణ-బెజ్జంకి
బాలల స్థాయినుండి విజ్ఞానం అందజేస్తూ బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి కృషి చేయడంలో గురువులదే ప్రధాన భూమికని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు హిమభిందు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణంలో గురుపూజోత్సవ వేడుకలను ఎన్ఎస్ఎస్ కో ఆర్డీనేటర్ వీ.నర్సింహ చారీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు హిమభిందు డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి పూలమాలు వేసి గురుపూజోత్సవ వేడుకలను ప్రారంభించారు.విద్యను భోదించే గురువుల సూచనలను పాటించిన విద్యార్థులు జీవితౌలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని హిమభిందు సూచించారు.ప్రతి ఒక్క విద్యార్థి గురువుకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకుంటారని శివ కుమార్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని అయా గ్రామాల పాఠశాలల్లో ఉపన్యాస పోటీలతో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రభుత్వ కళాశాల భోధన సిబ్బంది రాజేశ్వర్, అయా పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love