- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మరో నూతన భాస్కర న్యూరో ఫిజీషియన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యూరో ఫిజీషియన్ డాక్టర్ గడ్డం బాలస్వామి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూర్చ, పెరాలసిస్, ఫిట్స్, నరాల బలహీనత వంటి వ్యాధులకు సరైన చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. ఆదునతన టెక్నాలజీని ఉపయోగించి నరాల వ్యాధుల సమస్యలను తగ్గించడం జరుగుతుందని అందుకే నిజామాబాద్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకే నూతన ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు.
- Advertisement -