24 గంటల్లో 1930 కు ఫిర్యాదు చేయాలి 

– సైబర్ నేరాలపై ప్రజలకు ఏఎస్ఐ శంకర్ రావు అవగాహన 

నవతెలంగాణ – బెజ్జంకి 
సైబర్ నేరం జరిగిన 24 గంటల్లోపు 1930 కు బాధితులు ఫిర్యాదు చేయాలని..24 గంటల్లోపు నమోదైన సైబర్ నేరాలపై పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి న్యాయం చేయవచ్చునని ఎస్ఐ నరేందర్ రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ అవరణం వద్ద ఎస్ఐ నరేందర్ రెడ్డి అధ్వర్యంలో ప్రజలు సైబర్ నేరాలకు గురవ్వకుండా తీసుకునే జాగ్రత్తలు,సైబర్ నేరాలకు గురైనవారు తీసుకునే విధివిధానాలు, డయల్ 1930 పిర్యాదు చేసే విధానంపై ఏఎస్ఐ శంకర్ రావు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టెబుల్ కనుకయ్య,పోలీసులు శ్రీనివాస్,రవి కుమార్,సంతోష్ రెడ్డి,బాల్ రాజ్,అంజయ్య,ప్రజలు హజరయ్యారు.
Spread the love