Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశ కార్మిక రంగాన్ని దెబ్బతీసే కుట్ర

దేశ కార్మిక రంగాన్ని దెబ్బతీసే కుట్ర

- Advertisement -

కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తిప్పి కొడదాం
21న సంగారెడ్డిలో తెలంగాణ స్టేట్ ఫిక్స్ డ్‌ టర్మ్‌, అండ్‌ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలు..పోస్టర్‌‌ను ఆవిష్కరించిన సుదీప్‌ దత్తా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఫిక్స్డ్ టర్మ్ ,కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌, క్యాజువల్ వంటి నాన్ రెగ్యులర్ ఉద్యోగాల విస్తరణ వేగంగా పెరుగుతోందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష‍ులు సుదీప్‌ ‌దత్తా తెలిపారు. తెలంగాణ స్టేట్ ఫిక్స్ డ్ టర్మ్‌ అండ్‌ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 21న సంగారెడ్డిలో జరగనున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జె. మల్లిఖార్జున్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులుయ జె. చంద్రశేఖర్, బీరం మల్లేశం, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ తో కలిసి పోస్టర్‌‌ను ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీప్ దత్తా మాట్లాడుతూ ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల నేపథ్యంలో భారత దేశ కార్మిక రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఒకప్పుడు శాశ్వత ఉద్యోగాలు కార్మికులకు ఆర్ధిక భద్రత, సామాజిక గౌరవాన్ని కుటుంబ స్థిరత్వాన్ని కల్పించేవన్నారు. కానీ నేడు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ క్యాజువల్ వంటి నాన్ రెగ్యులర్ ఉద్యోగాల విస్తరణ వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపదను సృష్టించి దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులే నేడు ఉ ద్యోగ భద్రత లేకుండా, అభివృద్ధికి దూరంగా జీవించాల్సిన పరిస్థితికి ప్రభుత్వాలు నేడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిక్స్ టర్మ్, నాన్ రెగ్యులర్ ఉద్యోగాలతో లక్షలాది కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతుందన్నారు. ఈ విధానం వల్ల శాశ్వత ఉద్యోగాలు భవిష్యత్లో ఉండవని చెప్పారు. ప్రతి క్షణం ఉద్యోగ భద్రతపై ఆందోళనతో అభద్రత భావంతో జీవించాల్సిన దుస్థితికి కార్మికులు దిగజారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక రంగంలో ఫిక్స్డ్‌ టర్మ్ ఉద్యోగ విధానం ఒక ముఖ్యమైన అంశంగా మారిందన్నారు. కార్మికులను ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే నియమించుకుంటున్నారని చెప్పారు. ఒప్పందంలో పేర్కొన్న కాలం పూర్తయిన తర్వాత ఎటువంటి తొలగింపు ఉత్తర్వులు ఇవ్వకుండానే ఉద్యోగం ముగుస్తుందని పేర్కొన్నారు. ఫిక్స్డ్ టర్మ్ విధానంతో యాజమాన్యాలు తమ అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియమించుకునే తొలగించే సౌలభ్యం ఉన్నదన్నారు. ఇది కార్మికుల జీవితాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఫిక్స్డ టర్మ్ ఉద్యోగాల ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత లేకపోవడం, శాశ్వత ఉద్యోగాలు ఉండే స్థిరత్వం వీరికి ఉండదన్నారు. ఒప్పంద కాల ముగిసిన తర్వాత తిరిగి ఉద్యోగం ఇస్తారో లేదోననే అనిశ్చితి నిరంతరం వెంటాడుతోందని చెప్పారు. దీంతో కార్మికులు నిరంతరం భయాందోళన మధ్య పని చేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేసినప్పటికీ వారికి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ అనిచ్చితి కుటుంబం జీవితం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందనీ, పిల్లల, విద్యా, వైద్యం గృహ నిర్మాణం వంటి రోజువారీ అవసరాలు తీర్చడంలో అనేక ఇబ్బందులకు కార్మికులు గురవుతున్నారని తెలిపారు. చుక్క రాములు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత అనేది కేవలం ఉపాధి కొనసాగింపునకు సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, అది కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి పిల్లల విద్య, వైద్యం వృద్ధాప్య భద్రతకు గౌరవప్రదమైన జీవితానికి పునాదని తెలిపారు. ఉద్యోగం శాశ్వతంగా ఉంటుందని నమ్మకం ఉన్నప్పుడు కార్మికుల తన భవిష్యత్తును ప్రణాళిక బద్ధంగా నిర్మించుకోగలుగుతాడని పేర్కొన్నారు. కార్మికుడి ఆలోచన స్వేచ్ఛను హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ స్టేట్ ఫిక్స్డ్‌ ‌టర్మ్‌ అండ్‌ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభసంగారెడ్డిలో జరగనున్నదని, ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -