కాచికల్ గ్రామానికి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత

– లయన్స్ క్లబ్ సౌజన్యంతో మరియు మాజీ సర్పంచ్ గంజి గోవర్ధన్ దాత సహకారంతో డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత
– గంజి సందీప్ రెడ్డి స్మారకార్థంగా ఫ్రీజర్ బాక్స్ సర్పంచ్ శ్రీనివాస్ కు అందజేత
– కాచికల్ గ్రామ మాజీ సర్పంచ్ గంజి విజయపాల్ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని కాచికల్ గ్రామానికి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ను లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్, సౌజన్యంతో కాచికల్ గ్రామ మాజీ సర్పంచ్ గంజి విజయపాల్ రెడ్డి సతీమణి గంజి వసంత దాత సహకారంతో గంజి గంజి సందీప్ రెడ్డి జ్ఞాపకార్ధంగా క్లాసికల్ గ్రామ పంచాయతీకి గురువారం అందించినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ గంజి విజయపాల్ రెడ్డి తెలిపారు గురువారం కాచికల్ గ్రామ సర్పంచ్ గుగులోతు శ్రీనివాస్ ఉప సర్పంచ్ గట్టు శ్రీనివాస్ లకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాచికల్ గ్రామానికి గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామ సర్పంచ్ గా పనిచేశానని అన్నారు ఈ గ్రామ అభివృద్ధి కోసం నా వంతు సహకరణమే అందించాలని ఉద్దేశంతో 70 వేల రూపాయల విలువగల డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సును నా కుమారుడైన కీర్తిశేషులు గంజి సందీప్ రెడ్డి జ్ఞాపకార్ధంగా ఈ బాక్స్ ను గ్రామపంచాయతీకి అందిస్తున్నారని అన్నారు గ్రామ అభివృద్ధిలో నా వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఈ బాక్స్ న అందించడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించారని అన్నారు ఫ్రీజర్ బాక్స్ లేక కొంతమంది పేద కుటుంబానికి చెందిన వారు చనిపోయిన తర్వాత డెడ్ బాడీని కింద వేయడంతో చీమలు పట్టి ఉండే పరిస్థితి నెలకొన్నదని అన్నారు అవసరమైతే ఒకరోజు ఆ వాడిని ఆపాలంటే వాసన కూడా వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు అలా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు శ్రీనివాస్ ఉపసర్పంచ్ గట్టు శ్రీనివాస్ నాయకులు ఇట్టే దేవేందర్ రెడ్డి సారంపల్లి వెంకటరెడ్డి లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్లు కందు నూరి రాజేందర్ రెడ్డి లక్ష్మీనరసింహులు ఆర్ సి శారద జడ్పీ వెంకటేశ్వర్లు పి ఎస్ టి లు రమేష్ శ్రీనివాస్.  ప్రజలు పాల్గొన్నారు.
Spread the love