తెలంగాణలో రైతు రాజ్యం రావాలి

– మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి

నవ తెలంగాణ- రెంజల్:
తెలంగాణలో రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండల కేంద్రంలో రాత్రి 7 గంటలకు మండల ప్రజల తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, రాబోవు కాలంలో మండల కేంద్రంలోని బంధాల రోడ్డు, మాచవరం రోడ్డు పనులను పూర్తి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో 47 మంది, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 20 మంది, సాఠాపూర్ మహిళలు 20 మంది, మైనారిటీ సోదరులు, రైతన్నలు అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, శరత్ రెడ్డి, సిహెచ్ రాములు, జావీద్ , జి సాయి రెడ్డి, ఎంఎల్ రాజు, ఇంద్ర దేవి, మాజీ ఎంపీటీసీ కవిత, సాయిబాబాగౌడ్, అమ్రాద్ శేఖర్, కే శ్రీనివాస్, రవి, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love