మాక్లూర్ లో ఘనంగా బతుకమ్మ పండుగ

నవతెలంగాణ – మాక్లూర్ :
మండల కేంద్రంలో మహిళలు బతుకమ్మ పండుగను గ్రామ కమిటీ అధ్వర్యంలో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికి బతుకమ్మను తీసి గ్రామంలోని ప్రధాన విదుల గుండా బతుకమ్మ అడుతు శోభాయాత్ర నిర్వహిస్తూ గ్రామంలోని చింతల చెరువులో బతుకమ్మను నిమ్మజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, సొసైటీ మాజీ చైర్మన్ రమణారావు, ఎంపిటిసి వేకటేశ్వర్ రావు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love