నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
విశిష్ట ఎండిసిహెచ్ శ్రీనివాసరాజు జన్మదిన వేడుకలను హబ్సిగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కేక్ కట్ చేసి , స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేను శ్రీనివాసరాజు ఘనంగా సన్మానించారు. అనంతరం సేవా కార్యక్రమాలు అన్నదానం నిర్వహించారు. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్ లు పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సి హెచ్ విజయలక్ష్మి, స్వయం హోమ్స్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జంగయ్య యాదవ్, రియల్ విజన్ డైరెక్టర్స్ సతీష్, గౌరీపతి, కృష్ణ, మార్కెటింగ్ మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.