ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ

నవతెలంగాణ ఆత్మకూరు: ఎస్ మండలములోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఏపూర్ గ్రామంలో కోలాట ప్రదర్శనతో బతుకమ్మలను ఏటివద్ద ఉన్న ఘాట్ దగ్గరకు తీసుకువెళ్లి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలుతో ఆడి ఏటి లో బతుకమ్మను వదిలారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సానబోయిన రజిత సుధాకర్, ఎంపిటిసి దామిడి మంజుల శ్రీను, ఉప సర్పంచ్ అవిరె పద్మ అప్పయ్య, వార్డు సభ్యులు, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love