నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో అదివారం మంచి నీళ్ల పండుగ సంబురాలు అదివారం మండలంలోని అయా గ్రామాల్లో ఘనంగా జరిగాయి.మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో నిర్వహించిన మంచి నీళ్ల పండుగ సంబురాల ర్యాలీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.సర్పంచ్ టేకు తిరుపతి, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు హజరయ్యారు.