నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం..

Kaleswaram Will you dip..?నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది. అలా తమకు కలిసొస్తుంది అనుకున్న ప్రాజెక్టే, తమ కొంపముంచింది అని గూలాబీ పార్టీ భావించే పరిస్థితి ఏర్పాడింది. ఈ అగ్గిని అధికార కాంగ్రెస్ మరింత రాజేస్తోంది. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను దగ్గరుండి చూసేందుకు ఇవాళ మంత్రుల బృందం అక్కడికి పోతుంది. అయితే, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తారు. అలాగే, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందు కోసం నీటి పారుదల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Spread the love