గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

నవతెలంగాణ -యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట పట్టణం శుక్రవారం, సిఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10.00 గం.ల నుండి కొత్త గుండ్లపల్లీ శివారు లో పాత హెచ్ పీ పెట్రోల్ బంక్ దగ్గర జి ఉదయ్ కిరణ్ ఎస్ ఐ, వారి సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి రాయిగిరి వైపు నుండి ఒక బ్లూ కవర్ తో వస్తూ పోలీస్ వారిని చూసి కంగారుగా అటూ ఇటూ తిరగగా, పోలీస్ లు అతనిని పట్టుకొని, అతని వద్ద ఉన్న కవర్ ను తనిఖీ చేయగా  గంజాయి లభించింది.  అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు ఎస్ డి. జమీల్ తండ్రి హాసన్ అలి, గాంధీనగర్, యాదగిరిగుట్ట  అని తెలిపినాడు. ఇట్టి విషయం లో యాదగిరిగుట్ట ఎస్ ఐ రమేష్  నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు. ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
Spread the love