సెమీస్‌లో దక్షిణ కొరియాపై గెలుపు
షాంఘై (చైనా) : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్2లో భారత్ ఓ పతకం ఖాయం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్‌కప్‌లో మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో అగ్ర జట్టు, 10 సార్లు ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాపై 5-1తో ఘన విజయం సాధించింది. దీపిక కుమారి, అంకిత, మొహోద్ కుమ్‌కమ్ త్రయం దక్షిణ కొరియా ఆర్చర్లపై పైచేయి సాధించారు. 58-55, 56-56, 58-56తో సెమీఫైనల్లో గెలుపొందారు. దక్షిణ కొరియా అగ్రశ్రేణి ఆర్చర్లను కాదని యువ ఆర్చర్లను బరిలో నిలుపటం భారత్‌కు కలిసొచ్చింది. అంతకుమందు క్వార్టర్‌ఫైన్లలో వియత్నాంపై 5-4తో గెలుపొందిన భారత్.. ఉబ్జెకిస్తాన్‌పై 6-2తో విజయం సాధించింది. పురుషుల జట్టు సెమీఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూడగా.. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, అంకిత జోడీ సైతం నిరాశపరిచింది.
ఆర్చరీలో పతకం ఖాయం
- Advertisement -
- Advertisement -


