రియల్ ఎస్టేట్ ఆఫీసుగా మారిన మున్సిపల్ కార్యాలయం….

నవతెలంగాణ- ఆర్మూర్  

రియల్ ఎస్టేట్ ఆఫీసుగా మున్సిపల్ కార్యాలయం మారిందని బి జె పి ఫ్లోర్ లీడర్ జి వి నరసింహ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఆఫీస్ ముందు బి జె పి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం వచ్చి నుంచి సుమారు నాలుగు సంవత్సరాల నుంచి పెరికిట్ మామిడిపల్లి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములలో ఇరిగేషన్ భూములలో ఇంటి నంబర్లు మంజూరు చేస్తూ లక్షల రూపాయలు చేతులు మార్పిడి అయినయి మరి కాళీ ప్లాటుకు ఒక హౌస్ నెంబర్ జోడించి ఆ హౌస్ నంబర్ మున్సిపల్ రికార్డులు లేకపోవడం ఆశ్చర్యకరం మున్సిపల్ అధికారులకు ముడుపులు ముట్టిన వెంటనే అలాగే చైర్మన్ కు పెద్ద మొత్తంలో డబ్బులు అందడంతో ఈ హౌస్ నంబర్ ను అనుమతించినారు అలాగే మున్సిపల్ను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా నాలుగు దిక్కుల నుంచి నలుగురు చైర్మన్లు పరిపాలిస్తున్నారు  మున్సిపల్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మారిందని,  పట్టణంలో ఒక్కొక్క పర్మిషన్ ఆస్తి ఆ పర్మిషన్కు ధర నిర్ణయం చేసేది వేరే పేరు చెప్పుకొని మరి వీళ్ళు పంచుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ కమిషనర్ పాలకవర్గం వీరు అందరు కలిసి ఆర్మూర్ మున్సిపల్ ని దోచుకుంటున్నారు అని అన్నారు సుమారు మున్సిపల్ లో 100 కోట్లు అవినీతి జరిగింది దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి సిటింగ్ జర్జితోని విచారణ జరిపించాలని కోరినారు .ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉదయ్ కుమార్ ,కౌన్సిలర్ సాయికుమార్, ఆకుల శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు ,నర్సారెడ్డి కార్యకర్తలు యువ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love