అమిత్ షాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

నవతెలంగాణ న్యూఢిల్లీ: రాజస్థాన్‌ (Rajasthan) ఎన్నికల ప్రచారంలో(Election Campaign) ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బిడియాద్ గ్రామం నుంచి ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందకు వెళ్తుండగా నాగౌర్‌లోని రోడ్‌ షోలో అమిత్ షా ప్రచార రథం విద్యుత్ వైర్లను తాకింది. పర్బత్‌సర్‌లో రెండు వైపులా దుకాణాలు, ఇండ్లు ఉండగా.. ఆ వీధిలో ప్రచార రథం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యుత్‌ వైరు తెగిపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో అప్రమత్తమైన బీజేపీ(BJP) నేతలు అమిత్‌ షా వాహనం వెనుక ఉన్న మిగతా వాహనాలను వెంటనే ఆపేశారు. అనంతరం విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. మంగళవారం రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్‌ షా.. బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్‌ సీఎం(Rajasthan CM), కాంగ్రెస్‌(Congress) సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోట్(Ashok Gehlot) దర్యాప్తు చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Spread the love