తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం దంచికొట్టింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. లింగంపల్లి(Lingampally)లో అత్యధికంగా 4.0, చందానగర్‌ 3.5 సెం.మీ వర్షం కురిసింది. బాలానగర్‌, శేరిలింగంపల్లి(Serilingampally), చందానగర్‌(Chandanagar), ఉప్పల్‌(Uppal), బంజారాహిల్స్‌(Banjara Hills), జూబ్లీహిల్స్‌(Jubilee Hills), మాదాపూర్‌, కొండాపూర్‌, ఖైరతాబాద్‌, బేగంపేట, జీడిమెట్లతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది. మరో మూడు రోజుల పాటు గ్రేటర్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Spread the love