మెటా నుంచి కొత్త మైక్రోబ్లాగింగ్‌ యాప్‌

 ట్విట్టర్‌కు పోటీగా త్వరలో విడుదల
శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌కు పోటీగా కొత్త మైక్రో బ్లాగింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తేవడానికి ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా కసరత్తు చేస్తోంది. మెటా ఇప్పటికే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌ లాంటి కీలక వేదికలను నిర్వహిస్తోంది. ట్విట్టర్‌లో ఎలన్‌ మస్క్‌ చేస్తున్న సంస్కరణపై అనేక మంది అసంతృప్తిగా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మెటా కొత్త యాప్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని రిపోర్టులు వస్తో న్నాయి. మరోవైపు ట్విట్టర్‌ మాజీ అధిపతి జాక్‌ డోర్సీ కూడా బ్లూస్కైను తీసుకు వస్తోన్న విషయం తెలిసిందే. కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పైనే కొత్త మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ను మెటా తీసుకొస్తుందని సమాచారం. ఈ యాప్‌ దాదాపు ఇన్‌స్టాను పోలి ఉంటుందని రిపోర్టులు వస్తున్నాయి.

Spread the love