చెరువులో పడి వ్యక్తి మృతి…

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన బోయినివాని కిషన్ (40) అనే వ్యక్తి నడిపల్లి రాజేశ్వర్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడగా, ఈత రాక మృతిచెందినట్లు డిచ్ పల్లి ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తూండేవడని, అదివారం మధ్యాహ్నం సమయంలో కిషన్ చేపల వేటకు వెళ్ళడాని, ఈత రాక నీటిలో ఉండిపోయాయి సోమవారం మృతదేహం నడిపల్లి రాజేశ్వర్ చెరువులో కనిపించిందని పేర్కొన్నారు. భార్య గోదావరి ఇచ్చిన ఫిర్యాదు. మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ చెప్పారు.

 

Spread the love