రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


నవతెలంగాణ – భిక్కనూర్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన సంఘటన మండలంలోని బస్వాపూర్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య (29) భిక్కనూర్ నుండి బస్వాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళుతున్న లారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొనగా వాహనంపై ఉన్న ఎల్లయ్య అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.

Spread the love