ప్రమాదవశాత్తూ జారిపడి కాలు, చెయ్యి పోగొట్టుకున్న వ్యక్తి..

– రైలు ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది… 
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన  విష్ణు (55) రైళ్లల్లో  తినుబండరాలు అమ్ముకొని కుటుంబ జీవనం కొనసాగిస్తున్నాడు. బుదవారం డిచ్ పల్లి రైల్వే స్టేషన్ అడ్డా ఎక్స్ ప్రెస్  రైలు ఆగింది. ఒకోక్క డబ్బాలో ఎక్కి  తినుబండారాలు అమ్ముకుని కదులుతున్న సమయంలో ప్లాటుఫారం రైలు బోగి మధ్య కాలు జారీ ప్రమాద వశాత్తు పడ్డాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది  సురేష్, కిషన్ అక్కడికి చేరుకుని రైళ్లు చక్రల వద్ద  పడిన వ్యక్తిని సకాలంలో బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ ప్రమాదంలో ఎడమ కాలు మొత్తం ఊడిపోయింది. ఎడమ చేయి నుజ్జు నుజ్జు అయి అయింది. వేంటనే చికిత్స అందజేసి మరింత చికిత్స నిమిత్తం గాయాలపాలైన వ్యక్తికి, ఒక కాలును  హైదరాబాద్ కు  తరలించినట్లు నిజామాబాద్ రైల్వే పోలిస్ స్టేషన్ ఎస్ ఐ  సాయి రెడ్డి తెలిపారు.
Spread the love