ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరి మృతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ పరిధిలోని ఇందల్ వాయి శివారులోని పేద్ద చెరువు వద్దకు వెళుతుండగా ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇందల్ వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రాజేష్ 16 అక్కడికక్కడే  దుర్మరణం చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. స్థానికులు, పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రాజేష్ పెద్ద చెరువు వద్దకు వెళ్తుండగా మూల మలుపు వద్ద గండి తండా వైపు నుండి మండల కేంద్రం ఇందల్ వాయి స్టేషన్ వస్తున్న బైక్ ఎదురు ఎదురుగా ఢీకొనడంతో కుమ్మరి రాజేష్ అనే యువకుడు అక్కడి కక్కేడే మృతి చెందారు. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ కు సమాచారం అందజేశారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి రాజేష్ ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు దృవికరించారు. గండి తాండ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న లకావత్ నరేందర్ భార్య  పులి బాయ్, తన కుమారుడు అనారోగ్యంతో ఉండటంతో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సబ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. తల్లితండ్రలకు ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Spread the love