నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రదీప్ పురకాయస్థ రచించిన అలుపెరగని పోరాటం పుస్తక ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనం నందు ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ కార్యదర్శి కే రామ్మోహన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు పుస్తకాన్ని పరిచయం చేస్తారని, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ రామ్మోహన్రావు, శాస్త్రుల దత్తాత్రేయ రావు, తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.