కూలర్ షాక్ కొట్టి ఆరు సంవత్సరాల చిన్నారి మృతి..

నవతెలంగాణ  – ఆర్మూర్   

ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి ఒకసారి విద్యుత్ షాక్ కు గురై మరణించింది. జిల్లా కేంద్రంలో నివాసం ఉండే మనీష్, సౌందర్య దంపతులు ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు వేరే గ్రామానికి పని నిమిత్తం వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలను ఆలూరులో అమ్మమ్మ లావణ్య ఇంటి వద్ద వదిలేసి వెళ్ళినారు.. సాయంత్రం పూట ఆడుకుంటున్న చిన్నారుల్లో చిన్న కుమార్తె అయిన సింధూర (6)కూలర్ ను తాకింది. ఈ సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారికి షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు చిన్నారిని ఆర్మూర్ పట్టణానికి ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ..ఎప్పుడు సందడిగా గడిపే చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.. కాగా గత నెల 19వ తేదీ పట్టణంలో ఓ చిన్నారి కూలర్ ను ముట్టుకొని విద్యుత్ షాక్ తో మృతి చెందింది ..వరుస ఘటనలతో ఇంట్లో కూలర్లు ఏర్పాటు చేసుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Spread the love