మైనర్ బాలికను వేధిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం అయినదని ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన వ్యక్తి గత రెండు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని వెంటపడుతూ.. వేధిస్తున్నాడని ఫిర్యాదు రాగా అతనిపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు పంపడమైనదని ఎస్సై తిరుపతి తెలిపారు.