రాత్రి బ్యాంకు దోపిడీకి యత్నించి పట్టుబడ్డ దొంగ 

– సైరన్ మోగడంతో అప్రమత్తమైన ఉద్యోగులు- పోలీసులకు సమాచారం 
– వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న ఎస్ఐ వంశీ కృష్ణ రెడ్డి  
– సంఘటన స్థలానికి ఎసిపి కిరణ్ కుమార్,సిఐ సైదా సందర్శించారు 
నవతెలంగాణ- ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామములోని ఇండియన్ ఓవర్శిస్ బ్యాంకు దోపిడీకి ఒదొంగ ప్రయత్నించి విఫలం చెందాడు.సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన ఆలూరి సంతోష్ రెడ్డి అనే యువకుడు  11;55 సమయంలో దుబ్బాక గ్రామములోని బ్యాంకు లోపలకు చొరబడి దొంగతనానికి ప్రయత్నించే సందర్భంలో బ్యాంకు సైరన్ మోగడంతో సమీపంలోనే అద్దె ఇంతో నివాసము ఉంటున్న బ్యాంకు మేనేజర్ రాజు అప్రమత్తమై వెంటనే బ్యాంకుకు చేరుకొని గమనించగా ఎవరో గుర్తు తెలియని వెక్తులు దొంగతానికి యత్నిస్తున్నట్లు గమనించి, వెంటనే ధర్పల్లి ఎస్ఐ వంశీ కృష్ణకు సమాచారం అందించారు.దింతో వెంటనే స్పందించిన ఎస్ఐ అప్రమత్తమై తన బలగాలతో కేవలం కొన్ని నిమిషాలలో బ్యాంకు వద్దకు చేరుకొని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు ,అప్పటికే గ్రామములో ఓమహిళా మృతి చెందటంతో ప్రజలు మేలుకొని ఉండగా విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా బ్యాంకు వద్దకు చేరుకొని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా స్పందించిన ఎస్ఐ చాకచక్యంతో అసలు బ్యాంకు లో ఎంతమంది దొంగలు చొరబడ్డారనే దానిపై లోపల ఉన్న గొంగాను మాట్లాడే ప్రయత్నం చేశారు. దింతో లోపల ఉన్న దొంగ తాము ఎనిమిది మందిమి ఉన్నామని ,తనవెంట బీహార్ కు చెందిన వారు ఉన్నారని గ్రామస్థులకు,పోలీసులకు భయపెట్టించే విధంగా అలజడి సృష్టించేవిధంగా ప్రవర్తించడంతో, వాడి ఆగడాలకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎస్ఐ  ముందుగా ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎసిపి కిరణ్ కుమార్, బలగాలకు తీసుకోం సంఘారానా స్థలానికి చేరుకొని, ఎట్టకేలకు గ్రామస్థులకు పలు సూచనలు చేసి తమ బలగాలతో చాకచక్యంగా బ్యాంకు గేట్లు తలను మేనేజర్ ద్వారా తీయించి చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు, మిగితావారెరని దొంగను ప్రశ్నించగా ఎవ్వరు లేరని తానే బుకాయించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు, దింతో గ్రామస్తులు,పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. సదరు దొంగ ఇదివరకే గతంలో కొన్ని చోరీలకు పాల్పడినట్లు,ఇటీవల కొద్దీ నెలల క్రితం జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు తెలిసింది. చేదు వ్యసనాలకు అలవాటు పడి ఇంట్లో గొడవపడి దుబ్బాక గ్రామానికి వచ్చినట్లు తెలిసింది,గత 6,7 సంవత్సరాల క్రితం ఇదే గ్రామములో కొన్ని రోజులు ఇక్కడ డ్రైవర్ గా జీతముండి వెళ్లినట్లు తెలిసింది, అందుకొరకు ఈగ్రామములో బ్యాంకు ఉన్నట్లుపైగా చలికాలం, ప్రజలు ఎవ్వరు బయటికి రారు అందుకే తనపని తాను చేసుకొని వెళ్లిపోవచ్చని భావనతో వచ్చినట్లు తీసేసింది కానీ ఇక్కడ అనుకున్నది ఒక్కటైతే జరిగింది ఒకటి, ఏదేమైనా దొంగకు తగిన శాస్తి జరిగినట్లు గ్రామస్థులు అనుకున్నారు.
Spread the love