వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

– 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి మిత్రులు..
– విద్యా నేర్పిన గురువులను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతం..
– మధుర జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా దాచుకున్న విద్యార్థులు..
నవతెలంగాణ – వేములవాడ 
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి చిన్ననాటి నుండి ఒకే విద్య సంస్థలో చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ వేదికపై కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆదివారం  వేములవాడ పట్టణంలోని మహదేవ్ బాంకెట్ హల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో శ్రీ వెంకటరమణ ఉన్నత పాఠశాలలో 1999-2000 బ్యాచ్ లో పదవ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థినీ,విద్యార్థులు తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు.గడిచిన 25 ఏళ్ల కాలంలో తమ మిత్రుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.ఆత్మీయ సమ్మేళనం కోసం సుదూర ప్రాంతాల నుండి తమ పిల్లపాపలతో వచ్చి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.తమను ఉన్నతమైన స్థాయిలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేసిన విద్యా నేర్పిన గురువుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ వారిని ఘనంగా శాలువాతో సన్మానించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఒకరినొకరు పరిచయాలు చేసుకొని జీవితంలో వారు సాధించిన విజయాలు,కుటుంబ నేపథ్యంపై చర్చించుకున్నారు. గతంలో అకాల మరణం పొందిన గురువులు,విద్యార్థినీ, విద్యార్థులను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారందరికీ జ్ఞాపకంగా మెమోంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్ధిని,విద్యార్థులు ఎంతో బాగోద్వేదానికి లోనయ్యారు.తమ చిన్ననాటి మిత్రులందరూ జీవితంలో మరింత గొప్పగా రాణించాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావడానికి నెల రోజులుగా కృషి చేసిన నిర్వాహకులు నక్క శ్యామ్ కుమార్,నేరెళ్ళ రాధిక, నేరెళ్ల దేవిక,ఏనుగంటి శివప్రసాద్,రాపర్తి సాయికృష్ణ, ఓటరికారి రజినీ, ఎం.డి షాదుల్లా,అరెల్లి నరేష్,పొలస కృష్ణ ,శివాపర్ణ,కరీంనగర్ సంతోష్, గంగాధర్,బోడిగే దీపక్,యామ బాబు లకు విద్యార్థులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై ఎగోళ్ళ నాగరాజు,గురువులు పారువెళ్లి శ్రీనివాస్,యేల్ల పోశెట్టి,జగన్మోహన్,గోపన్నగారి శివకుమార్,సరళ మేడం లతో పాటు విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love