ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం..

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతలతో కలసీ పాల్గొన్నారు.. శనివారం ప్రభుత్వ విప్ ను వాసవి నిత్యాన్న సత్ర సంఘం వారు  ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వారు మరో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు స్వర్గీయ కోటగిరి వెంకటేశం, ఏగిని మురళి  ఆర్యవైశ్య సంఘానికి అందించిన కృషిని మరవలేనిది అన్నారు.సమాజంలో ఆర్యవైశ్యుల పాత్ర మరువలేనిదని వారు సమాజసేవలో ముందుంటురాన్నారు.ప్రభుత్వపరంగా ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని చెప్పారు. ఆర్యవైశ్యులకు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితులున్నారు.
Spread the love