Sunday, May 31, 2026
E-PAPER
Homeఆటలుసూర్యవంశీకి చోటు

సూర్యవంశీకి చోటు

- Advertisement -

ముంబయి : యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆసియా క్రీడల్లో భారత్‌‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 ‌నుంచి అక్టోబర్‌ 4 ‌వరకు జపాన్‌ ‌వేదికగా ఆసియా క్రీడలు జరుగుతాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్‌ ‌జట్టుకు 30 మంది ప్రాబబుల్స్‌‌తో కూడిన జాబితాను భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)కు బీసీసీఐ అందజేసింది. ఈ జాబితాలో ఐపీఎల్‌‌లో కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌‌లు ఆడిన వైభవ్‌ ‌సూర్యవంశీ ఉండగా.. టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ ‌యాదవ్‌, వన్డే కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌పేర్లు లేవు. ఆసియా క్రీడల సమయంలోనే స్వదేశంలో వెస్టిండీస్‌‌తో భారత్‌ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. దీంతో ఏక కాలంలో సెలక్ష‍న్‌ ‌కమిటీ రెండు టీ20 జట్లను ఎంపిక చేయనుంది. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌, తిలక్‌ ‌వర్మలలో ఒకరు కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది. గత ఆసియా క్రీడల్లో భారత్‌‌కు స్వర్ణం అందించిన కెప్టెన్‌ ‌రుతురాజ్‌ ‌గైక్వాడ్‌‌కు ప్రాబబుల్స్‌‌లో చోటు దక్కలేదు.

​ఆసియా క్రీడలకు ప్రాబబుల్స్‌
యశస్వి జైస్వాల్‌, అభిషేక్‌ ‌శర్మ, వైభవ్‌ ‌సూర్యవంశీ, ఇషాన్‌ ‌కిషన్‌, సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ ‌పంత్‌, హార్దిక్‌ ‌పాండ్య, రింకు సింగ్‌, తిలక్‌ ‌వర్మ, జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా, అక్ష‍ర్‌ ‌పటేల్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌, కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ప్రసిద్‌ ‌కృష్ణ, వరుణ్‌ ‌చక్రవర్తి, అనుకూల్‌ ‌రాయ్‌, ఆయుశ్‌ ‌బదోని, హర్ష్‌ ‌దూబె, ద్రువ్‌ ‌జురెల్‌, ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ ‌గైక్వాడ్‌, రవి బిష్ణోయ్‌, షాబాజ్ అహ్మద్‌, శివం దూబె, విప్‌‌రాజ్‌ ‌నిగమ్‌, హర్షిత్‌ ‌రానా, యశ్‌ ‌ఠాకూర్‌, వాషింగ్టన్‌ ‌సుందర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -