ముంబైలోని ఓ చౌరస్తాకు సినీనటి శ్రీదేవి పేరు

నవతెలంగాణ ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శ్రీదేవి గౌరవార్థం, ఆమెని గుర్తుచేసుకుంటూ ముంబైలోని ఓ చౌరస్తాకు ఆమె పేరు పెట్టారు. ముంబైలోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ ని శ్రీదేవి కపూర్ చౌక్ గా పేరు మార్చారు. శ్రీదేవి గతంలో ఆ రోడ్ లోనే నివసించేది. ఆమె అంతిమయాత్ర కూడా ఆ రోడ్ నుంచే జరిగిందని ఆమె జ్ఞాపకార్థంగా ఆ జంక్షన్ కి శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని అభినందిస్తున్నారు.

Spread the love