మండల కేంద్రమైన రెంజల అంగన్వాడి కేంద్రాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పోస్ట్కాహారం గురించి అంగన్వాడీ టీచర్ తో టీచర్ తో ఆమె చర్చించారు. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలోని చిన్నారుల ఎత్తు బరులను తూచి వారికి గుడ్లు పాలు అందించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులకు ఆకుకూరలతో ఆహారాన్ని అందించాలని ఆమె అన్నారు. గర్భిణీ బాలింత మహిళలకు అంగన్వాడి కేంద్రంలోని పౌష్టికాహారాన్ని అందించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యంతో, నడవలేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే టిఫిన్ బాక్సుల్లో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సుజాత, ఆయా మరియు గర్భిణీ బాలింత మహిళలు పాల్గొన్నారు.