– కుటుంబ సభ్యుల ఆరోపణ
నవతెలంగాణ అచ్చంపేట: వైద్యం వికటించి మూడు నెలల శిశువు మృతి చెందాడు. ఆర్ఎంపి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యుల రోదనలతో ఆప్రాంతాం విషాదఛాయలు అలుముకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బొమ్మలపల్లి గ్రామానికి చెందిన నాగమ్మ ఈదయ్య దంపతుల చెందిన మూడు నెలల శిశువు వాంతులు అవుతుండటంతో పట్టణంలోని చరిత సాయి చిన్నపిల్లల ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిరాని వైద్యం చేయడం వలనే శిశు మృతిచెందినట్టు ఆరోపించారు. డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.