ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

నవతెలంగాణ – మహబూబాబాద్: ప్రేమ విఫలమై తొర్రూరులోని చర్చి బజారుకు చెందిన అల్లం శ్యామ్‌ (26) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్‌ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి పస్తం స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Spread the love