చందుర్తి మండలంలో యువకుడు దారుణ హత్య

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల 
చందుర్తి మండలంలో యువకుడు గురువారం ఉదయం దారుణ హత్యకు గురైన ఘటన తో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.. వివరాల్లోకి వెళితే చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గురువారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పడిగేల నరేష్ (25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు గత పది రోజుల కిందట గల్ఫ్ దుబాయ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది. ఘటన స్థలానికి సిఐ కిరణ్ కుమార్ వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చందుర్తి మండలంలో ఇటీవల కాలంలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..

Spread the love