కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ7న ఆప్ నేతల నిరాహార దీక్ష

నవతెలంగాణ – ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 7న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. జంతర్ మంతర్ దగ్గర ఆప్ నేతలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దీక్ష చేపడునున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టుని నిరసించే ఎవరైనా ఏప్రిల్ 7న నిరాహారదీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా సామూహిక నిరాహారదీక్షలు చేయొచ్చని సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతంచేయడమే లక్ష్యంగా కేజ్రీవాల్ ని అరెస్టు చేశారని బీజేపీపై మండిపడ్డారు.

 

Spread the love