సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరవడం బాధాకరం

– మూడునెలలకోసారి సమావేశాలు ఉన్నా.. హాజరుకారా?
– ప్రజా ప్రతినిధుల తీరుపై ఎంపీపీ అసహనం
– గ్రామాల్లో మద్యం దుకాణాలు అరికట్టండి
నవతెలంగాణ-జోగిపేట
మూడు నెలలకు ఒకసారి గ్రామాల అభివద్ధిపై చర్చించే సమావేశాలకు ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరు కాకపోవడం బాధాకరమని ఆందోల్‌ ఎంపీపీ జోగు బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. గ్రామాభివద్ధి కోసం చర్చించే సమావేశాలకు రాకపోవడం ఎంతవరకు సమంజ సమన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ బాలయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమాశంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌ తన నివేదికను చదువుతుం డగా.. నాదులాపూర్‌, ఎర్రారం సర్పంచ్‌లు తమ గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్వర్‌రెడ్డి కూడా తమ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. మండలా నికి 9 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరయ్యాయని, వాటికి వెంటనే స్థలాలను చూపించాలని ఎంపీపీ బాలయ్య, తాలెల్మ పీహెచ్‌సీ డాక్టర్‌ సత్యనారాయణలు ఆయా గ్రామాల సర్పం చ్‌లను ఆదేశించారు. మండలంలో కోట్ల రూపాయల అభివ ద్ది పనులు జరుగుతున్నా.. పనుల వద్ద శిలాఫలకాలు వేయ డంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీపీ బాల య్య అన్నారు. పంటల నమోదు కార్యక్రమం ఈ నెల 31 వరకు ఉందని, రైతులు తమ పంటల వివరాలను నమోదు చేయించాలని ఏవో విజయరత్న సూచించారు. మండలంలో 51 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను ఒకటి మాత్రమే కొనసా గుతుందని, మిగతా కేంద్రాలను తేరిపించడంలో సర్పంచ ్‌లు, కార్యదర్శులు ఐకేపీ చోరవ చూపాలని ఐసీడీఎస్‌ సీడీపీవో రేణుక తెలిపారు. ఉపాధి హామీలో వంద రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాల్లో పదోతరగతి పాసైన వారికి ఉన్నతి పథకం కింద ఉద్యోగ అవకాశాల కోసం పలు రంగాల్లో శిక్షణను ఇచ్చి, అవకాశాలను కల్పిస్తారని ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. అక్టోబర్‌ 2 వరకు స్వచ్చత హి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీవో సౌజన్య తెలిపారు. నేరడిగుంటకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎంపీటీసీ కష్ణాగౌడ్‌ సూచించారు. ప్రభుత్వం అయిల్‌ ఫామ్‌ సాగుపై ప్రత్యేక శ్రద్దను తీసుకుంటుందని, దీనిని సాగు చేస్తే అధిక లాభాలను పొందవచ్చునని రాష్ట్ర మార్క్‌ ఫేడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపేట్టి అమలు చేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఖాదిరాబాద్‌ రమేష్‌, ఎంఈవో కష్ణ, పీఆర్‌ ఏఈ మొగులయ్య, విద్యుత్‌ ఏఈ శ్రీని వాస్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ మనోజ్‌, వేటర్నరి డాక్టర్‌ స్యంధ్యరా ణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love