
– జిల్లా స్థాయి సంక్షేమ హాస్టళ్ల జిల్లా అధికారులు ఆయా సంబంధిత కింది స్థాయి అధికారుల నుంచి నెల నెల మామూళ్ళు వసూలు
– (ఏ.ఐ.ఎస్.బీ) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న (ఎస్సీ,ఎస్టీ, ,బీసీ, కేజీబీవీ గురుకులల్లో) ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహలల్లో (ఏ.సీ.బీ) జిల్లా అధికారులు వెంటనే దాడులు నిర్వహించాలని (ఏ.ఐ.ఎస్.బీ) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సంక్షేమ వసతి గృహాలను నడుపుతుంటే కొంత మంది హాస్టల్ అధికారులు ఇదే తడవుగా లక్షలాది రూపాయలు మెక్కేస్తునరాని ఆయన మండిపడ్డారు.సంక్షేమ హాస్టళ్లపై (ఏ.సీ.బీ) అధికారులు దాడులు నిర్వహించి అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో ఉమ్మడి జిల్లాలో సంక్షేమ హాస్టళ్లపై (ఏ.సీ.బీ) అధికారులు దాడులు చేసినపుడు ఎన్నో అవినీతి అక్రమాలు బయట పడ్డాయాని ఆయన తెలిపారు.సంక్షేమ హాస్టలల్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ఇట్టే తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.జిల్లా ఉన్నత అధికారులు ఆయా సంబంధిత వార్డెన్లు,ఎస్.ఓ.లు,గురుకుల ప్రిన్సిపాలు,వార్డెన్ ల నుంచి నేల నేల మామూళ్లు తీసుకుంటూ పేద విద్యార్థుల పొట్ట కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే గతంలో నిర్వహించిన (ఏ.సీ.బీ) దాడుల మాదిరాగానే ప్రస్తుతం కూడా ఈ సారి దాడులు నిర్వహించాలని ఆయన అధికారులనూ విజ్ఞప్తి చేశారు.అన్ని హాస్టలళ్లో ఏసీబీ దాడులు నిర్వహించి అక్రమార్కుల అక్రమాలు లెక్కతీయాలని ఆయన కోరారు.కావున వెంటనే (ఏ.సీ.బీ) అధికారులు జిల్లా స్థాయి అధికారులపై,సంక్షేమ హాస్టలపై ఓ కన్ను వేసి దాడులు నిర్వహిస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకూ మేలు చేసిన వారవుతారని ఆయన తెలిపారు.